జిమ్ చేసేటప్పుడు కండరాల నొప్పులు మూడు, నాలుగు రోజులు తగ్గకపోతే అది కండరాల్లో చీలక కావచ్చని, నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ బరువు ఎత్తడం వల్ల కీళ్లలో క్లిక్ మని శబ్దం రావడం, మూత్రం రంగు మారడం (రబ్డోమైలోసిస్) వంటి లక్షణాలు కిడ్నీలకు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
అతిగా వ్యాయామం చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగి నిద్రలేమి, ఆందోళన, అలసట కలుగుతాయని తెలిపారు.