ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారుల కోసం '30 రోజుల తర్వాత చెల్లింపు' అనే కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు వస్తువులను కొనుగోలు చేసిన నెల రోజుల తర్వాత బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
డిజిటల్ చెల్లింపుల రంగంలో తన పట్టును పెంచుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ఈ ఆర్థిక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.