శరీరంలో విటమిన్ డి మోతాదు ఎక్కువైతే రక్తంలో కాల్షియం స్థాయిలు విపరీతంగా పెరిగి హైపర్‌కాల్సిమియా ఏర్పడుతుందని వైద్యులు తెలిపారు.
ఈ సమస్య కారణంగా వికారం, వాంతులు, అలసట, తరచుగా మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు.
సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇది కిడ్నీలలో రాళ్లు ఏర్పడటానికి మరియు కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుందని హెచ్చరించారు.