
రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 7,770 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, పోలింగ్ కోసం 2.52 లక్షల మంది సిబ్బందిని నియమించామని ఎన్నికల కార్యదర్శి డా. ఏ. మల్లికార్జున వెల్లడించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు బలగాలను మోహరించామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ ప్రణాళిక అమలు చేస్తున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.