
శుక్రవారం రాత్రి 8:05 గంటలకు పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్లోని బెహ్రూటీ గ్రామంపై పాకిస్తాన్ డ్రోన్ కనిపించడంతో భారత సైన్యం అప్రమత్తమైంది.
22 జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ బలగాలు వెంటనే స్పందించడంతో ఆ డ్రోన్ తిరిగి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయింది.
డ్రోన్ ద్వారా ఆయుధాలు లేదా డ్రగ్స్ ఏవైనా పడేశారేమోనని సైన్యం, బీఎస్ఎఫ్ మరియు పోలీసులు కలిసి శనివారం ఉదయం నుండి భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.