పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం, దేశంలో ఆహార అభద్రత 2018-19లో 15.92 శాతం ఉండగా, 2024-25 నాటికి 24.35 శాతానికి పెరిగింది.
తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య 2.37 శాతం నుంచి 5.04 శాతానికి రెట్టింపు కావడంతో ప్రజలు పాలు, మాంసం వినియోగాన్ని తగ్గించుకున్నారు.
ఖరీదైన పోషకాహారానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు వనస్పతి గీ వినియోగాన్ని 81 శాతం పెంచారని, ఇది దేశ ఆర్థిక దుస్థితిని ప్రతిబింబిస్తోందని నిపుణులు పేర్కొన్నారు.