
భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థను గుర్తించేందుకు పాకిస్థాన్ తన గూఢచారులను, స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసింది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ జెట్లు సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవడానికి ఈ ఎస్-400 వ్యవస్థే ప్రధాన కారణమని ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా తెలిపారు.
చైనా ఉపగ్రహాల ద్వారా భారత్ మోహరించిన ఎస్-400 స్థానాలను తెలుసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.