
చైనా నుంచి చౌక వస్తువుల దిగుమతిపై భారత్ చేసిన హెచ్చరికలను తాము పట్టించుకోలేదని బెల్జియం ప్రధాని బార్ట్ డె వెవర్ దిల్లీలో జరిగిన CII కార్యక్రమంలో పేర్కొన్నారు.
చైనా వస్తువుల డంపింగ్ వల్ల ఐరోపా పారిశ్రామిక పునాది బలహీనపడిందని, ఇతర దేశాలపై ఆధారపడొద్దని ప్రధాని మోదీ అప్పుడే సూచించారని ఆయన గుర్తు చేశారు.
భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో భారత్‌ను ఇప్పుడు కీలక భాగస్వామిగా చూస్తున్నామని, భవిష్యత్తులో భారత్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.