
ఇండియా లిటరసీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా లింగంపేట పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
శుక్రవారం పాఠశాలలో విద్యార్థులకు భవిష్యత్ కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని పలు అంశాలపై అవగాహన పొందారు.