
గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజ్ జనరేషన్ టూల్‌ను లాంచ్ చేసిన 24 గంటల్లోనే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళనలు రావడంతో గూగుల్ నిలిపివేసింది.
ఈ ఏఐ ఫీచర్ ద్వారా ఇరాన్ అణుకేంద్రం, గాజా ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రాంతాల నకిలీ చిత్రాలను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది.
మరింత పటిష్టమైన ప్రైవసీ మరియు భద్రతా చర్యలను అమలు చేసే వరకు ఈ కొత్త ఏఐ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు ఆల్ఫాబెట్ సంస్థ ప్రకటించింది.