
నీట్ వివాదంపై నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులతో సోమవారం అర్ధరాత్రి 2-3 గంటల పాటు చర్చలు జరిపారు.
బిహార్, అస్సాం ప్రభుత్వాలు ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను అందజేశాయని, రాజస్థాన్‌లోనూ హామీ లభించిందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
జూన్ 20న ప్రారంభమైన ఈ ఉద్యమం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తాత్కాలికంగా ముగిసినప్పటికీ, కేసుల ఉపసంహరణపై స్పష్టత కోసం విద్యార్థులు పట్టుబడుతున్నారు.