
పపువా న్యూగినియాలోని అడ్వంచర్ పార్క్‌లో మొసలికి ఆహారం పెడుతుండగా, ఒక కేర్ టేకర్‌ను మొసలి కాలు పట్టుకుని నీటిలోకి లాగేసింది.
తోటి సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినా మొసలి వదలకపోవడంతో, పోలీసులు కాల్పులు జరిపి మొసలిని చంపేశారు.
తీవ్రంగా గాయపడిన కేర్ టేకర్‌ను త్రీ మైల్ జనరల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.