
యువరాజ్ సింగ్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, గొంతును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఏఐ (AI) సాయంతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోలు, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని మెటా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కోర్టు ఆదేశించింది.
జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం, క్రీడాకారుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.