
హైదరాబాద్‌లోని బొల్లారం గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య కేసును మల్కాజ్‌గిరి పోలీసులు ఛేదించారు.
డబ్బు కోసం కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్ కుమార్ ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడు చిన్నారిని సెల్లార్‌లోని నీటితొట్టెలో పడేసి హత్య చేసినట్లు అంగీకరించాడని సీపీ సుమతి తెలిపారు.