
మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీని ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేసియా, థాయ్‌లాండ్ మరియు యూఏఈ జట్లు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
గత ఎడిషన్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయిన భారత్, ఈసారి ఎనిమిదో టైటిల్ కోసం పోటీ పడనుంది.