
హైదరాబాద్‌లో ఒరిజినల్ అంటూ అమాయక ప్రజలకు నకిలీ ఆపిల్ ఐఫోన్లు, వాచీలు విక్రయిస్తున్న ముఠా గుట్టును రాయదుర్గం పోలీసులు రట్టు చేశారు.
ఘజియాబాద్‌కు చెందిన ఆవేష్ ఖాన్, అల్తమాష్‌లు ఈ నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తుండగా, అల్తమాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి వద్ద నుంచి 2 ఐఫోన్లు, నాలుగు నకిలీ ఆపిల్ స్మార్ట్ వాచీలు, ఏడు నకిలీ ఇయర్‌బడ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.