
నడి సముద్రంలో బోల్తా పడిన పడవలో గల్లంతైన ఏడుగురు కోనసీమ మత్స్యకారులు బెంగాల్ తీరంలో సురక్షితంగా బయటపడ్డారు.
సముద్రంలో అలల ఉధృతికి పడవ బోల్తా పడటంతో ప్రాణభయంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకారు, ఆ తర్వాత వారు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.
మత్స్యకారుల ఆచూకీ లభ్యం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.