
ఆసియా కప్‌లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత అనుచితంగా ప్రవర్తించిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై ఐసీసీ జరిమానా విధించింది.
ఫాతిమా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చారు.
గత 24 నెలల్లో ఇది ఆమెకు రెండో తప్పు కావడంతో మొత్తం రెండు డీమెరిట్ పాయింట్లు నమోదయ్యాయని ఐసీసీ మ్యాచ్ రిఫరీ సుప్రియా రాణిదాస్ పేర్కొన్నారు.