
శ్రీలంకలో క్రికెట్ మైదానంలో జరిగిన గొడవలో 62 ఏళ్ల కోచ్ సుమిత్ ఫెర్నాండో మరణించగా, ఈ ఘటనకు సంబంధించి 17 ఏళ్ల స్కూల్ క్రికెటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మంచినీటి వసతి విషయంలో జరిగిన వివాదంలో సుమిత్ ఫెర్నాండోపై దాడి జరగడంతో, తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మరణించిన సుమిత్ ఫెర్నాండో గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్‌కు స్కూల్ క్రికెట్ కోచ్‌గా వ్యవహరించినట్లు సమాచారం.