
రోజుకు 30 నుండి 45 నిమిషాల వేగవంతమైన నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, సమయం అనేది వ్యక్తిగత జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం నడక వల్ల సహజ సూర్యకాంతి ద్వారా విటమిన్-డి లభించడమే కాకుండా, మానసిక ఉల్లాసం పెరిగి రోజంతా చురుగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది.
సాయంత్రం నడక వల్ల కండరాలు సడలి ఒత్తిడి తగ్గుతుందని, ముఖ్యంగా స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపేవారికి ఇది మంచి రిలాక్సేషన్‌గా పనిచేస్తుందని నిపుణులు సూచించారు.