
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సవరించిన బ్యాంక్ డిపాజిట్ల కొత్త నిబంధనలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త రూల్స్ ప్రకారం బ్యాంకులు రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ప్రతిరోజూ తమ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలి.
ఈ కొత్త నిబంధనలు కేవలం బల్క్ డిపాజిట్లకే వర్తిస్తాయని, సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.