
నల్ల నువ్వులలో ఐరన్, కాపర్, మెగ్నీషియం, బి-కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండటం వల్ల అలసటను తగ్గించి శరీరానికి శక్తిని అందిస్తాయి.
వీటిలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి నాడీ కణాలను రక్షించడంలో, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
రోజుకు 10-12 గ్రాముల వేయించిన నల్ల నువ్వులను పాలు, ఓట్స్ లేదా స్మూతీలలో కలుపుకుని తీసుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.