
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రస్తుత పెట్టుబడుల వాతావరణంపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఏఐలో కనిపిస్తున్నది బూమ్ కాదని, అదొక బబుల్ (బుడగ) అని ఆయన పేర్కొన్నారు.
ఈ బుడగలాంటి వాతావరణం తగ్గేంత వరకు డేటా సెంటర్లు, ప్రత్యేక హార్డ్వేర్ వంటి మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టకుండా వేచి చూస్తామని ఆయన స్పష్టం చేశారు.