
మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కేఎల్ రాహుల్, జట్టు ప్రదర్శన పట్ల కోపంగా ఉండటం తాను ఒక్కసారి మాత్రమే చూశానని వసీం జాఫర్ తెలిపారు.
ఐపీఎల్‌లో పలు జట్లకు సారథ్యం వహించిన రాహుల్, ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో కూడా కూల్‌గా ఉండటమే ఆయన ప్రత్యేకత అని జాఫర్ పేర్కొన్నారు.
రాహుల్ వివాదాలకు దూరంగా ఉంటూ తన ఆటపైనే దృష్టి పెడతారని జాఫర్ ప్రశంసించారు.