
భారత్‌తో జరిగిన మూడో వన్డేలో 352 పరుగుల రికార్డు ఛేదనలో వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్ 162 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
గతంలో మాజీ కెప్టెన్ ధోనీ ఇచ్చిన సలహా వల్లే ఇన్నింగ్స్ ఆసాంతం క్రీజులో ఓపికగా నిలబడి లక్ష్యాన్ని పూర్తి చేయగలిగానని హోప్ వెల్లడించాడు.
బ్యాటింగ్ చేసేటప్పుడు మనం ఆలోచించిన దానికంటే ఎక్కువ సమయం క్రీజులో ఉంటుందని ధోనీ చెప్పినట్లు హోప్ పేర్కొన్నాడు.