
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి సంబంధం ఉన్న డ్రోన్ల తయారీ సంస్థ ‘పవర్సస్’ పాకిస్తాన్ సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా పాక్ సైన్యం తొలి విడత డ్రోన్ల ఆర్డర్‌ను అప్పగించిందని పవర్సస్ సహ వ్యవస్థాపకుడు బ్రెట్ వెలికోవిచ్ వెల్లడించారు.
భద్రతా కారణాలరీత్యా డ్రోన్ల సంఖ్య, విలువను వెల్లడించనప్పటికీ, ఇవి పూర్తిగా మానవ రహిత వైమానిక వ్యవస్థలని స్పష్టం చేశారు.