
తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవాళ వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.
నవంబర్ 2, 3 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.