
ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సౌదీ అరేబియాలో మరణశిక్ష ఎదుర్కొంటున్న శ్రీలంక హిందూ వలస కార్మికుడు అనోజన్ శివరాసకు ఊరట లభించింది.
శ్రీలంక ప్రభుత్వం దౌత్యపరంగా జరిపిన ప్రయత్నాలు మరియు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడంతో అక్టోబరు 13న మరణశిక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువడింది.
అయితే మరణశిక్ష రద్దయినప్పటికీ ఆయనకు గతంలో కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్ష వర్తిస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.