తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
2026 డిసెంబరులో శంకుస్థాపన జరగనున్న ఈ స్టేడియం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కంటే ఎక్కువ సీటింగ్ సామర్థ్యంతో రూపొందనుంది.
బీసీసీఐ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ భూమి కేటాయింపుతో నిర్మించనున్న ఈ స్టేడియం అంతర్జాతీయ క్రీడలు, వినోద కార్యక్రమాలకు వేదికగా మారనుంది.