
క్యాబ్ సేవల సంస్థ ఉబర్ టెక్నాలజీస్ తన ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
ఇటీవల ఉద్యోగాల కోత చేపట్టిన ఉబర్, ఇప్పుడు కార్యాలయ పని విధానంలో మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.