
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వచ్చే నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడే సూచన ఉండగా, తెలంగాణలోని 23 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.