
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం, రూపాయి విలువ పుంజుకోవడంతో బంగారం ధర రూ. 2,640 తగ్గి రూ. 1.47 లక్షలకు చేరింది.
వెండి ధర కిలోకు రూ. 5,200 తగ్గి రూ. 2,24,800గా నమోదైందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
మదుపర్లు పెట్టుబడులను ఈక్విటీల వైపు మళ్లించడంతో ఈ విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయని విశ్లేషకులు తెలిపారు.