భారతీయ రైల్వేలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంలో భాగంగా దేశంలో తొలి ఎల్ఎన్జీ ఆధారిత డ్యూయల్ ఫ్యూయల్ రైలును గుజరాత్లోని సబర్మతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
ఈ రైలు డీజిల్-ఎల్ఎన్జీ డ్యూయల్ ఫ్యూయల్ వ్యవస్థ ద్వారా నడుస్తుందని, దీనివల్ల డీజిల్ వినియోగం దాదాపు 40 శాతం వరకు తగ్గుతుందని అధికారులు తెలిపారు.
సబర్మతిలో రూ.1,500 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే అభివృద్ధి పనులను కూడా ఆయన ప్రారంభించారు.