
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక ఆధారాలైన సూసైడ్ నోట్, ఐఫోన్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు.
జూలై 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేయగా, జూలై 28న నిందితుడు మిర్యాలగూడలో పోలీసులకు చిక్కాడు.
రెండు రోజుల కస్టడీ గడువు శుక్రవారం ముగియడంతో, మరిన్ని వివరాల కోసం పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో శనివారం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.