
దుబాయ్ వేదికగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగనున్న మహిళల టీ20 ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
గ్రూప్-ఎలో ఉన్న భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30న థాయిలాండ్‌తో ఆడనుండగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 5న తలపడనుంది.
మొత్తం 15 మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా, సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ విజేతను నిర్ణయిస్తారు.