
వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-19 వన్డే టోర్నీలో కర్ణాటక తరఫున ఆడుతున్న రాహుల్ ద్రవిడ్ కుమారుడు 17 ఏళ్ల అన్వయ్ ద్రవిడ్ అద్భుత ప్రదర్శన చేశాడు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కేవలం 41 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 85 పరుగులు చేసి కర్ణాటక భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో కర్ణాటక 198 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించగా, ఢిల్లీ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కెప్టెన్గా వ్యవహరించడం విశేషం.