
రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్ అని సంజూ శాంసన్ అన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా ఫేక్ అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.
సంజూ శాంసన్ ఎక్కడా ఇటువంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని, ఇది కేవలం క్రియేట్ చేసిన నకిలీ పోస్ట్ అని ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు.
2024 నుండి సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరలేదనే వాస్తవాన్ని వాడుకుంటూ కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.