రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 3 సంవత్సరాల తర్వాత దేశీయ రుణ మార్కెట్ ద్వారా రూ. 12,500 కోట్ల నిధులను సమీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఐదేళ్ల కాలపరిమితి గల ఈ బాండ్లపై ఇన్వెస్టర్లకు ఏడాదికి 7.47 శాతం కూపన్ వడ్డీ రేటును కంపెనీ ఆఫర్ చేయనుంది.
సెప్టెంబర్ 18 లోపు ఇన్వెస్టర్ల నుంచి బిడ్స్ ఆహ్వానించాలని కంపెనీ భావిస్తున్నట్లు మర్చంట్ బ్యాంకర్లు వెల్లడించారు.