
ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల భారత షట్లర్ మాన్సి సింగ్ రన్నరప్‌గా నిలిచింది.
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మాన్సి 16-21, 8-21 స్కోరుతో ప్రపంచ 81వ ర్యాంకర్, చైనాకు చెందిన షు వెన్ జింగ్ చేతిలో పరాజయం పాలైంది.
ప్రస్తుతం 76వ ర్యాంకులో ఉన్న మాన్సి, ఫైనల్‌కు చేరే క్రమంలో హాంకాంగ్ షట్లర్ లో సిన్ యాన్ హ్యాపీ మరియు రక్షిత రామ్‌రాజ్‌లను ఓడించింది.