
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను పదవి నుంచి తప్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేసింది.
లోతుకుంటలోని 40 ఎకరాల భూమిలో హైడ్రా కూల్చివేతలపై శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, నవంబర్ 3 వరకు విచారణను వాయిదా వేసింది.
వివాదాస్పద భూమిలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిన కోర్టు, ప్రభుత్వ భూముల రక్షణతో పాటు ప్రైవేట్ వ్యక్తుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.