
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ ల్యాబొరేటరీ ఉద్యోగి అంతుచిక్కని అనారోగ్యంతో మరణించడం కలకలం రేపింది.
28 ఏళ్ల డార్యా షిపిలోవా అనే మహిళ తీవ్ర న్యూమోనియా లక్షణాలతో మృతి చెందింది, ఆమె ప్లేగుపై పరిశోధనలు చేసే సంస్థలో పనిచేసేది.
ఆమెతో సంబంధం ఉన్న దాదాపు 200 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు, అయితే వ్యాధి లక్షణాలు ఎవరిలోనూ కనిపించలేదు.