
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చాక ఉద్యోగుల పని విధానంలో పెను మార్పులు వచ్చాయని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు.
ఏఐని తెలివిగా ఉపయోగించే ఒక్క వ్యక్తి పది మంది చేసే పనిని చేయగలడని ఆయన పేర్కొన్నారు.
దీనివల్ల ఉద్యోగాలు పూర్తిగా పోవని, ఉద్యోగాల స్వరూపం మాత్రమే మారుతుందని ఆయన స్పష్టం చేశారు.