
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
13 కోట్ల ఓట్లను తొలగించి బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టాలని చూస్తోందని, బలహీన వర్గాల ఓట్లను కాపాడటమే రాహుల్ గాంధీ లక్ష్యమని ఆయన ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఏం జరిగిందో ప్రధాని మోదీకి కూడా అదే జరుగుతుందని రేవంత్ హెచ్చరించారు.