
భారత ఎకానమీ వృద్ధికి ద్రవ్యోల్బణం, లిక్విడిటీ పరమైన రిస్కులు పొంచి ఉన్నాయని డీబీఎస్ బ్యాంక్ వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సగటున 7.3 శాతంగా ఉండొచ్చని, ద్వితీయార్థంలో వృద్ధి ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావొచ్చని బ్యాంక్ అంచనా వేసింది.
తక్కువ వర్షపాతం మరియు ఎల్నినో రిస్కుల వల్ల వ్యవసాయ పంటల దిగుబడిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.