
హర్మూజ్ జలసంధిలో 'ఎల్ గియా' అనే భారీ ఆయిల్ ట్యాంకర్ నౌక మైన్లను ఢీకొని పేలిపోయినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నేవీ ప్రకటించింది.
నిషేధించిన మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ట్యాంకర్ పూర్తిగా మంటల్లో చిక్కుకుందని పేర్కొన్నారు.
ఈ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, చట్టవిరుద్ధమైన మార్గాల్లో ప్రయాణిస్తే తీవ్ర ప్రమాదాలు ఎదురవుతాయని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.