
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) ప్రయోగం చిన్న, మధ్యతరహా బడుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఓఆర్‌ఆర్ వెలుపల 105 టీపీఎస్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, సమీపంలోని జెడ్పీ, మోడల్ స్కూల్స్, కేజీబీవీలను వాటిలో విలీనం చేస్తున్నారు.
స్కూళ్ల విలీనం మరియు విద్యార్థులను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో సుమారు 7,500 చిన్న పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది.