
చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆంక్షలు విధిస్తుండగా, తాజాగా 27 ఐరోపా దేశాల కూటమి కూడా ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ కూటమిలోని దేశాలు పిల్లల రక్షణ నిమిత్తం సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలని యోచిస్తున్నాయి.
దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక మార్గదర్శకాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.