
దేశీయ మార్కెట్లో మూడు రోజుల వరుస పెంపు తర్వాత బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,63,750 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.1,50,100 వద్ద స్థిరపడింది.
వెండి ధరలు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా గ్రాము రూ.265 వద్ద, కేజీ రూ.2,65,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.