
ముంబైలో జరిగిన బీసీసీఐ ఉన్నత స్థాయి సమావేశంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశం చర్చకు రాలేదని కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
రోహిత్ శర్మ అన్ని మ్యాచ్‌లలోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడని, అనవసరమైన వదంతలను తాను ప్రోత్సహించబోనని సైకియా పేర్కొన్నారు.
అజిత్ అగార్కర్ సమావేశానికి హాజరుకాకపోవడంపై స్పందిస్తూ, సమాచారం ముందుగా అందకపోవడం వల్లే ఆయన రాలేదని వివరణ ఇచ్చారు.