
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా తెరకెక్కుతున్న 'మహాకాళి' చిత్రం నుంచి 'శుక్రాచార్యుడి యుద్ధరావం' పేరుతో ఫస్ట్ గ్లింప్స్ సోమవారం విడుదలైంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా రాక్షసుల గురువు శుక్రాచార్యుడిగా నటిస్తుండగా, భూమి శెట్టి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2027 జనవరి 8న సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.